Share News

క్యూనెట్ కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్ సింగ్ అరెస్ట్

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:19 PM

క్యూనెట్ కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

క్యూనెట్ కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్ సింగ్ అరెస్ట్

ఇంటర్‌నెట్ డెస్క్: క్యూనెట్ కేసులో కీలక నిందితుడు డిగ్ విజయ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ద్వారా నిందితుడిని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో డిగ్ విజయ్ సింగ్ భారీగా ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక కమీషన్లు, భారీ రాబడులు, విదేశీ పర్యటనల ఆశచూపి బాధితులతో పెట్టుబడులు పెట్టించినట్లు అతనిపై అభియోగాలు నమోదయ్యాయి.


జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులను సుమారు రూ.10 వేల కోట్ల వరకు మోసం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు 43 మంది బాధితులను విచారించగా.. సుమారు రూ.5 కోట్ల మేర లావాదేవీల వివరాలు గుర్తించారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.4 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని సంబంధిత కోర్టులో నిందితుడిని పోలీసులు హాజరుపరచనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Updated Date - Oct 17 , 2026 | 09:34 PM