జంతర్ మంతర్ వద్ద హింసపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్
ABN , Publish Date - Oct 17 , 2026 | 08:45 PM
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ (హెచ్‌పీఈసీ) ఈ పోర్టల్‌ను ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ (హెచ్‌పీఈసీ) ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో ఢిల్లీ జంతర్ మంతర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపైనా విచారణ చేయనున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. బాధితులు, పోలీసు సిబ్బంది ఫిర్యాదుల కోసం hpec.nic.in పోర్టల్‌ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ విచారణ చేపట్టనుంది. పెల్లెట్ గన్స్ వినియోగంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు, వేధింపులపైనా కమిటీ విచారించనుంది. ఇరు వైపుల నుంచి జరిగిన హింస, ఆస్తుల విధ్వంసాన్ని పరిశీలించనుంది.
బాధితులు తమ ఫిర్యాదులు, వినతిపత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు కమిటీ అవకాశం ఇచ్చింది. బాధితులు కోరుకుంటే వారి గుర్తింపును గోప్యంగా ఉంచేలా పోర్టల్‌ను రూపొందించారు. బలహీన వర్గాల సాక్షులకు తగిన రక్షణ కల్పించే ఏర్పాట్లు చేశారు. అలాగే.. హింసాత్మక ఘటనలకు సంబంధించిన సమాచారం, సూచనలు అందించేందుకు ఇతరులకు కూడా అవకాశం ఇచ్చారు. భౌతికంగా ఫిర్యాదు చేయాలనుకునేవారు ఢిల్లీలోని హెచ్‌పీఈసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆ కార్యాలయ చిరునామా: శిక్షా సదన్, 17, రౌస్ అవెన్యూ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ – 110002. పని దినాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. పోస్టు ద్వారా లేదా hpec2026.enquiry@nic.in ఈ-మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు