బంగ్లాదేశ్ రిసార్టులో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:27 PM
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా.. 9 మంది గాయపడ్డారు. కాక్స్ బజార్లోని ఇనానీలో పటువార్టెక్ బీచ్ సమీపంలో ఉన్న రిసార్టులో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా.. 9 మంది గాయపడ్డారు. కాక్స్ బజార్లోని ఇనానీలో పటువార్టెక్ బీచ్ సమీపంలో ఉన్న రిసార్టులో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మూడంతస్తుల కలప భవనం ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగినపుడు రిసార్టులో 30 మంది ఉన్నారని అధికారులు వెల్లడించినట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. వారిలో ఐదుగురు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించింది. మిగతావారి ఆచూకీ తెలియరాలేదని పేర్కొంది.
కాగా.. గాయపడిన వారిని కాక్స్ బజార్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పిన తర్వాత ఆరు మృతదేహాలను వెలికితీశారు. వాటిని మృతుల కుటుంబాలకు ఇచ్చే ముందు డీఎన్ఏ నమూనాలు సేకరిస్తామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ముందుగా రిసార్ట్ కిచెన్లో మంటలు అంటుకుని ఉండవచ్చని కొంతమంది చెప్పారని తెలిపారు. దర్యాప్తు పూర్తిచేస్తే తప్ప అగ్ని ప్రమాదానికి కారణాలు స్పష్టంగా చెప్పలేమని పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక