యాంటీ డ్రగ్ యాక్టివిస్ట్ పర్వీందర్ సింగ్ హత్య.. నిందితుడి దుకాణానికి నిప్పు
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:45 PM
పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న యాంటీ డ్రగ్ యాక్టివిస్ట్ పర్వీందర్ సింగ్ జోటా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాాజాగా జోటా హత్య కేసు నిందితుడి మెడికల్ షాపుకు స్థానికులు నిప్పు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న యాంటీ డ్రగ్ యాక్టివిస్ట్ పర్వీందర్ సింగ్ జోటా హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో మాన్సా ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని అశ్విన్‌ని పర్వీందర్ నిలదీశారు. ఈ ఘటనను అతడి ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన దుకాణదారుడు కాల్పులు జరపడంతో పర్వీందర్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ దారుణ హత్యతో పంజాబ్‌లోని మాన్సా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, పర్వీందర్ సింగ్ నిందితుడైన అశ్విన్ దుకాణానికి ఆగ్రహించిన మద్దతుదారులు నిప్పుపెట్టారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఉద్రిక్తతల మధ్యే అక్రమ నిర్మాణాలంటూ ఆరోపణలు వస్తున్న నిందితుడి ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు.
సంఘటన జరిగిన వెంటనే పంజాబ్ నుంచి పరారైన ప్రధాన నిందితుడు అశ్విన్‌ని పోలీసులు గాలించి, రాజస్థాన్‌లోని చూరు ప్రాంతంలో ఇవాళ (బుధవారం) ఉదయం అరెస్టు చేశారు. మాన్సా జిల్లా ఎస్పీ వైభవ్ చౌదరి మాట్లాడుతూ.. అల్లర్లు చెలరేగకుండా తగిన బలగాలను మోహరించామని, అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సామాజిక కార్యకర్త దారుణ హత్యకు గురికావడం పంజాబ్‌లో చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
బుమ్రాపైనే ఇంకెన్నాళ్లు ఆధారపడుతారు?: క్రిస్ శ్రీకాంత్