Share News

బంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:09 PM

బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (PK) సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు.

బంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
prashant kishor wins

పాట్నా, ఆగస్టు 03: బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (PK) సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు. ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు.


నేడు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్‌ కుమార్‌ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకున్నారు. పీకేకు 63,203 పోలయ్యాయి. అలానే రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,250, మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి 14,085 ఓట్లు సాధించారు. ఈ చరిత్రాత్మక విజయం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తన గెలుపు బీజేపీ హైకమాండ్‌కు ఒక బలమైన సందేశమని వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని బిహార్ ముఖ్యమంత్రిగా చేశారని తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నిక ఫలితం బిహార్ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు సంకేతమని ఆయన పేర్కొన్నారు.


రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. బంకీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీ కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో.. 1995 నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అసాధారణ విజయం సాధించడం, బీజేపీ కంచుకోటలో జేఎస్‌పీ జెండా ఎగురవేయడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రశాంత్ విజయంతో.. జేఎస్పీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి:

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అలాంటి భాగస్వామిపై క్రిమినల్ కేసులు..

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 03 , 2026 | 05:49 PM