Share News

పూంచ్‌లో భారీ పేలుడు.. నలుగురు ఉగ్రవాదులు మృతి!

ABN , Publish Date - Oct 12 , 2026 | 09:51 PM

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా క్రిష్ణా ఘాటీ సెక్టార్‌లో జరిగిన భారీ పేలుడులో లష్కర్‌-ఇ-తైబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌తో సహా నలుగురు చొరబాటుదారులు దుర్మరణం చెందారు.

పూంచ్‌లో భారీ పేలుడు.. నలుగురు ఉగ్రవాదులు మృతి!
Poonch Blast

ఇంటర్నెట్ డెస్క్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా క్రిష్ణా ఘాటీ సెక్టార్‌లో జరిగిన భారీ పేలుడులో లష్కర్‌-ఇ-తైబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌తో సహా నలుగురు చొరబాటుదారులు దుర్మరణం చెందారు. నియంత్రణ రేఖ (LoC) వెంబడి నాంగీ టెక్రి ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు ఈ ఉగ్రమూక యత్నించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన పటిష్ఠమైన యాంటీ-ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌లో భాగంగా అమర్చిన ల్యాండ్‌మైన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.


పేలుడు ఘటనలో మృతి చెందిన వారిలో లష్కర్‌-ఏ-తైబా టాప్‌ కమాండర్ మొహమ్మద్ ఫైజాన్‌తో పాటు వకాస్, ఇస్తియాక్, ఆసిమ్‌లుగా గుర్తించారు. సోమవారం ఉదయం క్రిష్ణా ఘాటీ సెక్టార్‌లోని సత్వాల్-నాకి ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. కాగా, మెంధార్ సెక్టార్‌లోనూ మరికొన్ని ల్యాండ్‌మైన్లను గుర్తించిన బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటుయత్నాలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ, మన బలగాల పటిష్ఠ నిఘా కారణంగా వారి కుట్రలు భగ్నమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం

మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు

Updated Date - Oct 12 , 2026 | 09:54 PM