జ్యుడీషియల్ మెంబర్ తప్పనిసరి.. ఈడీ ఆస్తుల జప్తుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:55 PM
మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన ‘న్యాయనిర్ణాయక సంస్థ’ (Adjudicating Authority) పనితీరుపై ఈరోజు (గురువారం) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 26: మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సంబంధించిన ‘న్యాయనిర్ణాయక సంస్థ’ (Adjudicating Authority) పనితీరుపై ఈరోజు (గురువారం) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల నిర్ధారణపై విచారణ జరిపే బెంచ్‌లో జ్యుడీషియల్ మెంబర్ తప్పనిసరిగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ ఆస్తులపై ఏకసభ్య బెంచ్ విచారణ జరిపినా, ఆ సభ్యుడు కచ్చితంగా అన్ని న్యాయ అర్హతలూ కలిగిన జ్యుడీషియల్ మెంబర్ అయి ఉండాలని తేల్చిచెప్పింది.
అయితే 'న్యాయనిర్ణాయక సంస్థ' చైర్‌పర్సన్‌గా జ్యుడీషియల్ మెంబర్ ఉండాలన్న నిబంధన లేదని ‘సుప్రీం’ వివరించింది. ఈ తీర్పు భవిష్యత్తు కేసులకే వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రభావం పాత కేసులపై ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుల సత్వర పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా మరిన్ని 'న్యాయనిర్ణాయక సంస్థ’ల ఏర్పాటును పరిశీలించాలని కేంద్రానికి న్యాయస్థానం సూచించింది.
ఈ వార్తలూ చదవండి
పాక్ కంటెంట్‌పై నో ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం హెచ్చరిక
ఐఏఎస్ హత్య కేసు.. బిహార్ మాజీ ఎంపీ ముందస్తు విడుదల రద్దు