13 వరకు ఊటీ కొండరైలు రద్దు
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:24 PM
భారీ వర్షాల కారణంగా ఊటీ కొండ రైలు సేవలను ఈ నెల 13 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
చెన్నై: భారీ వర్షాల కారణంగా ఊటీ కొండ రైలు సేవలను ఈ నెల 13 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబరు 23 అర్థరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మేట్టుపాళయం - ఊటీ రైలు మార్గంలో పలు చోట్ల మట్టి చరియలు విరిగిపడ్డాయి. పట్టాలపై పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు కూడా పడ్డాయి. దీంతో ఊటీ కొండ రైలు సేవలను రద్దు చేశారు. రైల్వే కార్మికులు, ఇంజనీర్లు రైలు మార్గం మరమ్మతు పనులు చేపట్టారు. ఓ వైపు పట్టాలపై పడిన రాళ్లు, మట్టిచరియలు తొలగిస్తుండగానే మరికొన్ని చోట్ల పట్టాలపై మట్టి పెళ్ళలు విరిగిపడ్డాయి.
దీంతో రైలు మార్గం మరమ్మతు పనులు పూర్తికాలేదు. దీంతో ఈ నెల 10 వరకు కొండ రైలు సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ రైలు మార్గాన్ని అధికారులు తనిఖీ చేసి రైలు సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయిస్తుండగా నీలగిరి జిల్లా అంతటా బుధవారం నుంచి శుక్రవారం దాకా మళ్లీ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ఈ కొండ రైలు సేవలను ఈ నెల 13 వరకు రద్దు చేస్తున్న రైల్వే యాజమాన్యం ఓ ప్రకటన జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు..సోనియా గాంధీపై అన్నా హజారే ఆగ్రహం..
బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News