మేజర్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీను వెల్లడించిన ఎన్టీఏ
ABN , Publish Date - Oct 27 , 2026 | 09:22 AM
మేజర్ ఎంట్రెన్స్ టేస్టుల తేదీ (ఎగ్జామినేషన్ క్యాలెండర్) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరించింది. వచ్చే డిసెంబర్ నుంచి ఏప్రిల్ 2027 మధ్య జరిగే పరీక్షల కొత్త తేదీలను ఎన్టీఏ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: మేజర్ ఎంట్రెన్స్ టేస్టుల తేదీ (ఎగ్జామినేషన్ క్యాలెండర్) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరించింది. వచ్చే డిసెంబర్ నుంచి ఏప్రిల్ 2027 మధ్య జరిగే పరీక్షల కొత్త తేదీలను ఎన్టీఏ వెల్లడించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ నెట్), జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2027, కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యూట్) పీజీ 2027 పరీక్షల కొత్త తేదీలను ఎన్టీఏ విడుదల చేసింది. ఎన్టీఏ కొత్త షెడ్యూల్ ప్రకారం.. యూజీసీ నెట్ 2026 పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 18 వరకు, డిసెంబర్ 21న నిర్వహిస్తారు. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష డిసెంబర్ 19, 22, 27న నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ 2027 సెషన్ 1 ఎగ్జామ్ జనవరిలో జరుగుతుంది. మార్చిలో క్యూట్ పీజీ, ఏప్రిల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 జరుగుతుంది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ పరీక్ష డిసెంబర్ 6న, స్వయం పరీక్షలు డిసెంబర్ 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 13న జరగనుంది. అయితే.. సవరించిన షెడ్యూల్ తాత్కాలికమేనని ఎన్టీఏ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్, లాజిస్టికల్, ఇతర కారణాల వల్ల పరీక్షల తేదీలు మారవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అప్డేట్ల కోసం ఎన్టీఏ వెబ్సైట్ nta.ac.in ను చెక్ చేస్తూ ఉండాలని ఎన్టీఏ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్