Share News

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

ABN , Publish Date - Oct 26 , 2026 | 09:42 PM

సీఈసీ పనితీరుపై దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల సంఘం (ECI) తాజాగా సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. SIRతో సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్
ECI Affidavit In Supreme Court

ఇంటర్నెట్ డెస్క్: సీఈసీ పనితీరుపై దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల సంఘం (ECI) తాజాగా సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. SIRతో సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. కేవలం ఒకే ఒక్క వార్తా కథనం ఆధారంగా పిటిషన్ వేశారని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది. సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించిన అఫిడవిట్‌ను ఈసీ సమర్పించింది.

జూన్ 2025, అక్టోబర్ 2025, మే 2026 నాటి మూడు ఎస్ఐఆర్ (SIR) ఉత్తర్వులు కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలేనని తెలిపింది. ఫైళ్ల కదలిక సమయంలో సీఈసీ లేదా కమిషనర్లు రాసే నోట్స్, సూచనలు తుది నిర్ణయాలు కావని స్పష్టం చేసింది. ఫైళ్లు ఇద్దరు కమిషనర్లకు చేరిన తర్వాతే సీఈసీ వద్దకు వెళ్తాయని తెలిపింది. అందరి అభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని తెలిపింది.


అధికార పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసే ఏ అధికారిపైన అయినా కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలిపింది. జూలై 28న డిప్యుటేషన్‌పై ఉన్న ఓ అదనపు కార్యదర్శి జారీ చేసిన పని విభజన ఉత్తర్వు నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసింది. ఉత్తర్వు వెలువడిన మరుసటి రోజే కేబినెట్ సెక్రటరీకి ఇద్దరు ఈసీలు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జూలై 30న ఇద్దరు ఈసీల ఉమ్మడి ఆదేశాలతో జూలై 28 నాటి ఆదేశాల అమలు నిలిచిపోయింది.

డిక్లరేషన్ ఫారం గురించి కూడా ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఫారం-6ను సవరించే అధికారం కేంద్రానిదేనని తెలిపింది. ఎస్ఐఆర్ (SIR) డిక్లరేషన్ పూర్తిగా వేరొక పత్రమని స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి ఆన్‌లైన్‌లోనూ ఫారం-6, డిక్లరేషన్ వేర్వేరుగా కనిపించేలా మార్పులు చేసినట్టు వెల్లడించింది. మ్యాపింగ్ కాని ఓటర్లకు విచారణకు రావాల్సిన పనిలేదని తెలిపింది. బీఎల్ఓలే ఇళ్లకు వెళ్లి పత్రాలు సేకరిస్తారని ఈసీ పేర్కొంది. ఈఆర్ఓ (ERO) ఆదేశం లేకుండా ఈసీఐనెట్‌లో ఒక్క ఓటు కూడా చేర్చడం లేదా తొలగించడం జరగదని చెప్పింది. ఈసీఐనెట్ భద్రత కోసం ఐఐటీ, ఐఐఎస్‌సీ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు కూడా ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 26 , 2026 | 10:17 PM