Share News

వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపు: మోహన్ భాగవత్

ABN , Publish Date - Nov 09 , 2026 | 01:38 PM

వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలైన గుర్తింపు అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు.

వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు గుర్తింపు:  మోహన్ భాగవత్
Mohan Bhagwat

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): వందేళ్ల ప్రస్థానంలో స్వార్థం లేని 'స్వయంసేవకులే' ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలైన గుర్తింపు అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్ భాగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసేవారే ప్రచారకులని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ నూతన ఆడిటోరియాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి, ప్రసంగించారు.


ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించారు..

1930లలో ఆర్‌ఎస్‌ఎస్‌పై తొలి నిషేధ యత్నం నాటి ఆసక్తికర ఘట్టాన్ని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. నాటి రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్థించే స్వయంసేవకులు, భావజాల మద్దతుదారులు గానీ సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో లేరని చెప్పుకొచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై తొలి నిషేధయత్నం జరిగినప్పుడు సభలో మద్దతు తెలిపిన ఏకైక వ్యక్తి ఇబ్రహీం అని ప్రస్తావించారు. ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ సంస్థ కాదని, నిషేధించవద్దని నాటి సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించారని మోహన్ భగవత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి

సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 09 , 2026 | 01:52 PM