Share News

బీజేపీ చీఫ్ నితిన్‌తో షమీ భేటీ

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:49 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ ఆదివారం భేటీ అయ్యారు. ఢిల్లీలో నితిన్‌ను ఆయన కలిశారు. షమీ వెంట బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా ఉన్నారు.

బీజేపీ చీఫ్ నితిన్‌తో షమీ భేటీ

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ ఆదివారం భేటీ అయ్యారు. ఢిల్లీలో నితిన్‌ను ఆయన కలిశారు. షమీ వెంట బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా ఉన్నారు. అయితే, భేటీకి సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు. ఈ ఏడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధరిని కూడా షమీ కలిశారు. దీంతో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షమీ పోటీచేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే, అమ్రోహలోని క్రీడా మౌలిక సౌకర్యాలకు నిధులు కేటాయించినందుకే జయంత్ చౌధరిని షమీ కలిశారని ఆర్ఎల్డీ నేతలు తెలిపారు. మరో ఇండియన్ క్రికెటర్ యుజువేంద్ర చాహల్ వారం రోజుల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పరిణామం తర్వాత నితిన్ నబిన్‌ను షమీ కలిశారు.


తాజాగా టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత నితిన్‌ను కలవడంతో షమీ రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. 36 ఏళ్ల షమీ టెస్టు క్రికెట్‌కు ఇటీవలే రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులో 64 మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 229 వికెట్లు తీశారు. తన చివరి టెస్టును 2023లో ఆస్ట్రేలియాపై వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఆడారు. అలాగే 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిల్యాండ్‌పై ఆయన తన చివరి వన్డే ఆడారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. టీ20, వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని ఆయన తెలిపారు. ఇక డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత

Updated Date - Nov 29 , 2026 | 04:49 PM