Share News

ప్రియురాలితో దొరికిపోయిన భర్త.. తప్పించుకునేందుకు భార్యను కారుతో ఈడ్చుకెళ్లి..

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:31 PM

ప్రియురాలితో కలిసి భర్త మోమోస్ తింటుండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే తప్పించుకోవడానికి అతడు.. భార్యను కారుతో ఢీకొట్టి, కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు.

ప్రియురాలితో దొరికిపోయిన భర్త.. తప్పించుకునేందుకు భార్యను కారుతో ఈడ్చుకెళ్లి..
husband dragged wife by car

ఇంటర్నెట్ డెస్క్: తన ప్రియురాలితో కలిసి భర్త మోమోస్ తింటుండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతడు.. భార్యను కారుతో ఢీకొట్టి, కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరట్‌లో నిన్న (శనివారం) జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ అనే వ్యక్తి తన ప్రియురాలితో కలిసి డేట్‌కు వెళ్లాడు. వీరు కారులో కూర్చొని మోమోస్ తింటున్నారు. అదే సమయంలో మయాంక్ భార్య అక్కడికి వచ్చింది. తన భర్త మరో మహిళతో ఉండడం చూసి ఆమె షాక్ అయింది. వెంటనే వెళ్లి మయాంక్‌ను నిలదీసింది. భార్యను చూసిన అతడు కారు విండో గ్లాస్ క్లోజ్ చేసి, లాక్ చేశాడు. దీంతో ఆమె విండో గ్లాస్‌పై తట్టడం మొదలుపెట్టింది. తప్పించుకునేందుకు మయాంక్ కారు స్టార్ట్ చేశాడు. వీరిని వెళ్లనివ్వకుండా భార్య అడ్డుగా నిలబడింది. అయినా అతడు ఆగకుండా కారు ముందుకు పోనిచ్చాడు. ఆమెను 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు.


అనంతరం మయాంక్‌పై అతడి భార్య ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మయాంక్‌ను అరెస్ట్ చేశారు. అలాగే అతడి ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో ఉపయోగించిన కారునూ స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలూ చదవండి

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

ఓ కొడుకు ‘మొక్క’వోని దీక్ష!

Updated Date - Oct 04 , 2026 | 03:36 PM