Share News

పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:00 AM

పోలవరం ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అథార్టీ సీఈవో సంజీవ్‌ వోహ్ర శనివారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణంలో ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వొద్దని సూచించారు.

పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో

  • అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశం

పోలవరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అథార్టీ సీఈవో సంజీవ్‌ వోహ్ర శనివారం పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణంలో ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వొద్దని సూచించారు. శుక్రవారం రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో రోడ్‌ రోలర్‌ నడిపించి ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల పటిష్టతను ఆయన పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణంలో గ్యాప్‌ 1,2 జీ హిల్‌ ప్రాంతాలను ఆయన కాలినడకన వెళ్లి ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. తొలుత అధికారులతో ప్రాజెక్టు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని, దానికి అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 06:00 AM