Share News

ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం.. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:42 PM

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టనున్న ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు.

ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం.. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన
3 lakhs house constuction in ap

గుంటూరు, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టనున్న 3 లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు.


ఏపీ వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ళను నిర్మించేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌‌గా గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ఎంచుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెంతో పాటు ఓబులనాయుడు పాలెంలో రూ.14 కోట్లతో117 ఇళ్లను నిర్మించనుంది. కేంద్ర ప్రభుత్వం, CSIR-CBRI, ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అదనపు ఆదాయం కోసం ఆటో కొనుక్కున్న టెకీ.. చివరకు..

థ్రిల్‌ను పంచిన పెళ్లి ప్రపోజల్‌

Updated Date - Oct 04 , 2026 | 01:56 PM