Share News

కేరళలో అగ్ని ప్రమాదం.. మూడు స్కూల్ బస్సులు దగ్ధం

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:27 PM

కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం ఓ పాఠశాల మైదానంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు స్కూల్ బస్సులు దగ్ధమయ్యాయి.

కేరళలో అగ్ని ప్రమాదం.. మూడు స్కూల్ బస్సులు దగ్ధం
Thiruvananthapuram Fire

ఇంటర్నెట్ డెస్క్: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పల్లిప్పురం సమీపంలోని ఓ పాఠశాల మైదానంలో పార్కింగ్‌లో ఉంచిన మూడు స్కూల్ బస్సులు మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.


మూడు బస్సులు పూర్తిగా కాలిపోవడంతో యజమానులకు భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇంజిన్‌ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేదా ఎవరైనా కావాలని నిప్పుపెట్టారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపడతామన్నారు.


ఈ వార్తలూ చదవండి:

ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం

కాకినాడ పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి

Updated Date - Feb 23 , 2026 | 02:04 PM