నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి
ABN , Publish Date - Feb 23 , 2026 | 08:19 AM
నేపాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫోకారా నుంచి ఖాట్మండుకు వెళ్తున్న బస్సు ధాడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫోకారా నుంచి ఖాట్మండుకు వెళ్తున్న బస్సు ధాడింగ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18మంది మృతిచెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ మున్సిపాలిటీ-5లోని భైసిగౌడ వద్ద పృథ్వీ హైవేపై బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు నేపాల్ సాయుధ పోలీసు దళం డీఎస్పీ థాపా తెలిపారు. మూడు భద్రతా సంస్థల సమన్వయంతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి వివరాలు ఇంకా గుర్తించలేదని డీఎస్పీ థాపా చెప్పారు.
ఈ వార్తలూ చదవండి:
ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
కాకినాడ పెన్సిలిన్-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి