Share News

పైన కుర్చీల వ్యాపారం.. లోన మద్యం యవ్వారం.!

ABN , Publish Date - Feb 22 , 2026 | 10:41 AM

ఓ వ్యక్తి టెట్రా ప్యాకెట్లలో అక్రమంగా మద్యం సప్లయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడు టెట్రా ప్యాకెట్లను సరఫరా చేసే విధానం చూసి పోలీసులు షాక్ తిన్నారు.

పైన కుర్చీల వ్యాపారం.. లోన మద్యం యవ్వారం.!
Bihar Liquor Smuggling,

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి టెట్రా ప్యాకెట్లలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతను టెట్రా ప్యాకెట్లలో మద్యం తీసుకుపోయే విధానం చూసి పోలీసులే షాక్ తిన్నారు. బిహార్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. బైక్‌పై కుర్చీలు పెట్టుకుని అమ్ముతున్న ఓ వ్యాపారి కనిపించాడు. వెంటనే ఆ బైక్ ఆపి తనిఖీ చేయగా.. కుర్చీల మధ్యలో చాకచక్యంగా పేర్చిఉంచిన టెట్రా ప్యాకెట్ల‌ను చూసి పోలీసులకు అనుమానం కలగడంతో అసలు గుట్టు బయటపడింది.


ముజఫర్‌పుర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై తిరుగుతూ కుర్చీల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుర్చీల వ్యాపారంలో సరిగా ఆదాయం రాకపోవడంతో సైడ్ బిజినెస్‌గా అక్రమంగా మద్యం విక్రయించడం మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా కుర్చీల మధ్యలో టెట్రా మద్యం ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాడు. కుర్హానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పడంతో పేర్చిన కుర్చీలను తీసి చూశారు. అందులో దాదాపు 250 టెట్రా ప్యాకెట్లు కనిపించాయి. దీంతో పోలీసులు అతణ్ని అదుపులోకి విచారణ చేపట్టారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘పుష్ప సినిమాను మించిపోయింది’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తరా?’ అని మరొకరు స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చందమామ ‘చిన్న’బోతోంది

జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2026 | 03:19 PM