గుజరాత్ టెక్ట్స్‌టైల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:24 PM
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభించింది. సూరత్‌లోని ఖార్వాసాలో ఓ దుస్తుల గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభించింది. సూరత్‌లోని ఖార్వాసాలో ఓ దుస్తుల గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 10 నుంచి 12 ఫైర్ టెండర్లు వాడి అగ్నికీలలను అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. మొత్తం 60 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని వెల్లడించారు. అలాగే జేసీబీ యంత్రాలను కూడా వాడి మంటలను ఆర్పామని చెప్పారు.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా.. ఈనెల 7న బావ్లా-అహ్మదాబాద్‌లో లీమాక్ కంపెనీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడు.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు