కన్నతల్లిపై కత్తితో దాడి చేసిన బాలుడు.. కాసేపటికి..
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:34 PM
అస్సాంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆ బాలుడు ఎత్తైన భవనంపై నుంచి కిందపడి మరణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆ బాలుడు ఎత్తైన భవనంపై నుంచి కిందపడి మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ రాష్ట్ర రాజధాని గువాహటిలో చంద్రాణి అనే మహిళ తన కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న (శుక్రవారం) ఇంటికి వచ్చిన కుమారుడు.. కత్తి తీసుకుని ఒక్కసారిగా తల్లిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తరువాత ఆ బాలుడు బయటకు పారిపోయాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చంద్రాణిని గువాహటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరోవైపు ఈ ఘటన జరిగిన కొంతసేపటి తరువాత చంద్రాణి కుమారుడు భవనంపై నుంచి కింద పడి మరణించాడని పోలీసులకు తెలిసింది. వెళ్లి చూడగా బాలుడి మృతదేహం లభ్యమైంది. తీవ్ర గాయాల కారణంగా అతడు మరణించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా కన్నతల్లిపై కుమారుడు ఎందుకు దాడి చేశాడనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. అలాగే ఆ బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడా..? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా..? అన్న విషయంపైనా స్పష్టత రాలేదు. విచారణ జరుపుతున్న పోలీసులు స్థానికుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఇది రాజకీయాలకు ఆవల మరో కోణం.. ‘బిలాంగింగ్’పై శశిథరూర్ వ్యాఖ్య
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్