Share News

కారుకు ఏటీఎం కట్టి చోరీకి యత్నం.. చివరకు ఏమైందంటే

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:51 PM

ఏటీఎంను కారుకు కట్టి దొంగిలించడానికి దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజస్థాన్‌లో అల్వార్‌లోని బిజ్లీ నగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దొంగలు ఏటీఎంను కారుకు కట్టి చోరీ చేయడానికి యత్నించిన ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

కారుకు ఏటీఎం కట్టి చోరీకి యత్నం.. చివరకు ఏమైందంటే

ఇంటర్‌నెట్ డెస్క్: ఏటీఎంను కారుకు కట్టి దొంగిలించడానికి దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాజస్థాన్‌లో అల్వార్‌లోని బిజ్లీ నగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దొంగలు ఏటీఎంను కారుకు కట్టి చోరీ చేయడానికి యత్నించిన ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ముందుగా ఓ కారులో కొందరు దొంగలు ఏటీఎం వద్దకు వచ్చారు. తర్వాత ఒక దొంగ తన ముఖానికి మాస్కు ధరించి ఏటీఎంలోకి చొరబడ్డాడు. దొంగతనం గురించి తెలియకుండా ఉండేందుకు ఏటీఎంలో అమర్చిన సీసీటీవీ కెమెరాపై నల్లటి స్ప్రే చల్లాడు. తర్వాత ఏటీఎంకు తాడు కట్టాడు. తాడు మరో చివరను కారుకు కట్టాడు. చివరగా కారుతో ఏటీఎంను పెకిలించేందుకు యత్నించారు. కానీ సాధ్యం కాలేదు.


అప్పటికే ఆ ప్రాంతంలో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఏటీఎం చోరీ యత్నాన్ని గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు దొంగలు కారులో పారిపోయారు. అనంతరం ఏటీఎం దొంగతనం యత్నంపై బ్యాంక్ మేనేజర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అలాగే వారిని పట్టుకునేందుకు ఒక పోలీసు టీంను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Oct 14 , 2026 | 04:14 PM