Share News

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!

ABN , Publish Date - Mar 29 , 2026 | 03:13 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు తెలుస్తోంది.

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!
Encounter

ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లా అడవులు తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు సమాచారం. పోలంపల్లి అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా దళాలు వెంటనే కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారికి మావోలు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల నుంచి కాల్పులు మెుదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్ కగార్ చేపట్టి 2026 మార్చి నెలాఖరు నాటికి మావోలు లేకుండా చేయాలని నిర్ణయించింది. భద్రతా దళాలను రంగంలోకి దింపి వరుస ఎన్‌కౌంటర్లతో వందల మందిని హతమార్చింది. దీంతో వేల మంది తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అడవులు వదిలి బయటకు వచ్చారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు, అగ్రనేతలు వంటి వారు ఉండడం విశేషం.

మరోవైపు మార్చి 30న లోక్ సభలో నక్సలిజం నిర్మూలనపై చరిత్రాత్మక చర్చ జరగనుంది. లోక్‌సభలో రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చను ప్రారంభించి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భద్రతాపరమైన చర్యలు, ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకురానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..

Updated Date - Mar 29 , 2026 | 03:25 PM