బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్..
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:45 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలందరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలందరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారని వారిపై స్పీకర్ సీరియస్ అయ్యారు.
సభకు ఆటంకం కలగించవద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలందరినీ ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి బయటకు వెళ్లిన కారు పార్టీ ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
కాగా, హైదరాబాద్‌లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేస్తోందని.. అది మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై వెంటనే ప్రతి పక్ష నేత ఆధ్వర్యంలో సభా సంఘం ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిన్నటి నుంచి సభలో దీనిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేడు కూడా కారు పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద వెళ్లి పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్
ఐపీఎల్ 2026: నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!