Share News

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క ఫైర్..

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:12 PM

బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అన్నారు.

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క ఫైర్..
Bhatti Vikramarka statement

హైదరాబాద్, మార్చి 29: బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అన్నారు. పదేళ్లు హౌస్ కమిటీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ తాము సభను అడ్డుకోలేదని చెప్పారు. నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను పదే పదే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు జరగాలనుకున్నట్టు సభ జరగదని స్పష్టం చేశారు.


అసెంబ్లీలో భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘వృద్ధ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే బిల్లుపై మాట్లాడమంటే అల్లరి చేస్తున్నారు. స్పీకర్‌కు నోటీస్ ఇవ్వకుండా మంత్రి పేరు తీయడమే తప్పు. సీబీ సీఐడీకి ఇచ్చిన తర్వాత కూడా అల్లరి ఎందుకు. చప్పట్లు కొట్టుకుంటూ సభను అంగడిలా మార్చకండి. గతంలో వేసిన హౌస్ కమిటీలతో ఏం సాధించారు. పదేళ్లలో మీరు వేసిన హౌస్ కమిటీల రిపోర్ట్ సభలో పెట్టారా?. బీజేపీ సలహా మేరకు కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగిస్తే ఏం జరిగింది. బీఆర్ఎస్ నేతలు సభను జరగనివ్వొద్దన్న ఎజెండాతో వచ్చారు. ప్రజలకు మేలు జరగొద్దని వారు అనుకుంటున్నారు. ధరణి పేరిట అనాడు వందల ఎకరాల భూములను తమ వారి పేర్ల పైకి బదలాయించుకున్నారు. వాటిపై హౌస్ కమిటీ వేయండి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.

Updated Date - Mar 29 , 2026 | 12:21 PM