పని మనిషి దారుణం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందని..
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:44 PM
ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. గుజరాత్‌లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ, మార్చి 29: గుజరాత్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగిందన్న కోపంతో మహిళను హత్య చేసింది ఓ మాజీ పని మనిషి. డ్రగ్స్ ఇచ్చి మరీ ప్రాణాలు తీసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. పాలన్‌పూర్‌కు చెందిన శాంతికి 15 ఏళ్ల క్రితం రేఖ రాథోర్‌తో పరిచయం ఏర్పడింది. శాంతి ఇంట్లో రేఖ పని చేసేది. రేఖ ఆ ఇంట్లో పని చేయటం మానేసినా కూడా ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగింది. సంవత్సరం క్రితం రేఖ పర్నీచర్ బిజినెస్ స్టార్ట్ చేసింది.
బిజినెస్ కోసం శాంతి దగ్గరినుంచి బంగారం, డబ్బులు అప్పుగా తీసుకుంది. శాంతి గత కొన్ని నెలలనుంచి బంగారం, డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రేఖపై ఒత్తిడి తెస్తోంది. శాంతి ఒత్తిడి తట్టుకోలేకపోయిన రేఖ దారుణమైన నిర్ణయం తీసుకుంది. శాంతిని చంపడానికి పూనుకుంది. ఓ నలుగురు వ్యక్తులతో కలిసి మర్డర్ ప్లాన్ వేసింది. రేఖ మార్చి 22వ తేదీన శాంతిని తన ఫర్నీచర్ షాపునకు పిలిచింది. శాంతి అక్కడకు వెళ్లింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. రేఖ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి శాంతికి ఇచ్చింది.
మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగిన తర్వాత శాంతి స్పృహ కోల్పోయింది. రేఖతో పాటు ఆమె గ్యాంగ్‌లోని నలుగురు వ్యక్తులు శాంతిని దారుణంగా హత్య చేశారు. శాంతి శవాన్ని గోనె సంచిలో కుక్కి పాడబడ్డ షోరూములోని బేస్‌మెంట్‌లో పడేశారు. శాంతి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో రేఖ.. శాంతిని మర్డర్ చేసినట్లు తేలింది. రేఖతో పాటు ఆమెకు సహకరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మూడు ముక్కలాట క్లోజ్.. అమరావతిపై చంద్రబాబు సంచలన ప్రకటన!
అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు