Share News

తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:37 PM

తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అని ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu Amaravati Announcement

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పామని ఆయన గుర్తుచేశారు. తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సామాన్య కార్యకర్తలను, వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారిని చట్టసభలకు పంపించిన ఘనత టీడీపీకే దక్కుతుంది. ‘పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి.. వారు గౌరవంగా బతకాలి’ అన్న నందమూరి తారక రామారావు ఆశయమే పార్టీకి పునాది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజకీయంగా బలోపేతం చేసిందీ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయి. ఇకపై ‘మూడు ముక్కలాట’ ఉండదు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. రాజధాని అభివృద్ధిని అడ్డుకునే శక్తులను, వ్యతిరేకించే వారిని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Mar 29 , 2026 | 02:37 PM