Share News

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:14 PM

లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court rape victim identity

న్యూఢిల్లీ, మార్చి 29: లైంగిక దాడులకు గురైన బాధితుల ఆత్మగౌరవాన్ని, గోప్యతను కాపాడాల్సిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార బాధితుల వివరాలను వెల్లడించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది.


అత్యాచార బాధితుల పేర్లను ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ముద్రించడం, ప్రచురించడం చేయకూడదు. ఇది వరకు వెల్లడించిన తీర్పుల్లో బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను ప్రస్తావించడం వల్ల వారు మానసిక క్షోభకు గురవుతారని ధర్మాసనం పేర్కొంది. బాధితుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం వారి సామాజిక భద్రతకు అత్యంత ముఖ్యమని కోర్టు ఆదేశించింది. వార్తా సంస్థలు ఈ తరహా కేసులను నివేదించేటప్పుడు బాధితులకు ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ అధికారులు ఛార్జ్‌షీట్‌లు లేదా ఇతర అధికారిక పత్రాల్లో బాధితుల గుర్తింపు బయటపడకుండా చూడాలని కోర్టు హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Mar 29 , 2026 | 03:16 PM