Share News

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉద్యోగ్ భవన్ సమీపంలో చెలరేగిన మంటలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 07:31 AM

దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఓ స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉద్యోగ్ భవన్ సమీపంలో చెలరేగిన మంటలు
Delhi Fire Accident

ఢిల్లీ, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఈరోజు (బుధవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఓ స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బస్తీలోని ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో మంటలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్తీలోని ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో మొదట మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న తాత్కాలిక నిర్మాణాలకు వేగంగా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి.


మంటలార్పిన 20 ఫైరింజన్లు..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ప్రమాద స్థలానికి ఏకంగా 20 ఫైరింజన్లను తరలించారు. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 07:38 AM