Share News

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ABN , Publish Date - May 31 , 2026 | 06:01 PM

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, పదిమందికి పైగా గాయపడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Karnataka Accident

ఇంటర్నెట్ డెస్క్, మే 31 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, పదిమందికి పైగా గాయపడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక మహింద్రాథార్, ఆటో, క్యాంటర్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.


మూడు వాహనాలు ఒకేసారి బలంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగి, ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసులు సహాయంతో బాగేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు, గాయపడిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనతో బాగేపల్లి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ

సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 06:07 PM