Share News

నాసిక్ కుంభమేళా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ము.. మహారాష్ట్ర ప్రత్యేక ఆహ్వానం

ABN , Publish Date - Oct 21 , 2026 | 09:26 PM

మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వర సింహస్థ కుంభమేళా ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రాష్ట్రపతి దౌపది ముర్మును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని అధికారుల బృందం అధికారికంగా ఆహ్వానించింది.

నాసిక్ కుంభమేళా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ము.. మహారాష్ట్ర ప్రత్యేక ఆహ్వానం
maharashtra invitation to president murmu

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో వైభవంగా జరిగే సింహస్థ కుంభమేళాను అక్టోబర్ 31న జెండా ఎగురవేసి అధికారికంగా ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించారు. కుంభమేళాతో పాటు మహా హారతి, నాసిక్ త్రయంబకేశ్వర్ కుంభ్ మేళా వెబ్‌సైట్ ప్రారంభం, కుంభ్ మేళా నేపథ్య గీతాన్ని ఆవిష్కరించడం, కుంభ్ మేళా ప్రత్యేకతలు తెలిపే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, సునేత్ర పవార్, క్యాబినెట్ మంత్రులతో పాటు పలు ఉన్నాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, గిరిజన వారసత్వ కళలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ప్రాముఖ్యం సంతరించుకుంది. సింహస్థ కుంభ మేళా నేపథ్యాన్ని తెలిపేలా ఆహ్వాన పత్రికను రూపొందించారు. నాసిక్ ప్రకృతి సౌందర్యాలను వర్ణిస్తూ.. పత్రికను రూపొందించారు. గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన దూప్‌స్టిక్స్, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారపదార్థాలు, మహువా పువ్వులతో చేసిన ఉత్పత్తులు, వెదురు ఉత్పత్తులు, స్వచ్ఛమైన తేనెతో పాటు.. మహారాష్ట్ర ప్రత్యేకమైన పైఠాని చీరను రాష్ట్రపతికి బహుకరించారు. ఇవి మహారాష్ట్ర సంస్కృతీ సాంప్రదాయాలను, వైవిధ్యతను తెలియజేయడమే కాకుండా.. గిరిజనులకు, కళాకారులకు, చేనేతకారులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రపతికి బహుకరించినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:
భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతివ్వని పీసీబీ

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Oct 21 , 2026 | 09:51 PM