జడ్జీలు ప్రేక్షకులు కాదు.. న్యాయం జరిగేలా మార్గనిర్దేశం చేయాలి: మద్రాస్ హైకోర్టు
ABN , Publish Date - Jun 18 , 2026 | 07:31 PM
కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.
ఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా (Sphinx)లా కూర్చోకూడదని స్పష్టం చేసింది. ఆయా కేసుల విచారణలో న్యాయమూర్తులు చురుగ్గా పాల్గొనాలని, లాయర్లు వాదనలు వినిపిస్తున్నప్పుడు వారితో సంభాషణ జరపాలని హైకోర్టు పేర్కొంది. కేవలం వినడం మాత్రమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో ప్రశ్నలు అడిగి స్పష్టత తీసుకోవడం న్యాయప్రక్రియలో ముఖ్యమని తెలిపింది.
క్రియాశీలక పాత్ర పోషించాలి..
న్యాయమూర్తులు ప్రేక్షకుల్లా కాకుండా, న్యాయం సాధనలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ సమయంలో జడ్జీలు ఎలాంటి హావభావాలు లేకుండా పూర్తిగా మౌనంగా ఉండటం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘స్ఫింక్స్’లా నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల కేసులోని వాస్తవాలు వెలుగులోకి రాకపోవచ్చని అభిప్రాయపడింది. లాయర్లు వాదనలు వినిపిస్తున్నప్పుడు న్యాయమూర్తులు చురుకుగా పాల్గొని, తమ సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
లాయర్ల మధ్య పరస్పర చర్చ ఉండాలి..
వాదనల సమయంలో న్యాయమూర్తులు, లాయర్ల మధ్య పరస్పర చర్చ ఉండాలని.. ఇది న్యాయవ్యవస్థలో కీలక భాగమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఇది కేసులోని నిజాలు స్పష్టంగా బయటకు రావడానికి సహాయపడుతుందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు వినడమే కాకుండా, న్యాయమూర్తులు తక్షణ ప్రశ్నల ద్వారా కేసును మరింత సమగ్రంగా అర్థం చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
లీగల్ సర్కిల్స్‌లో చర్చ..
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు ప్రస్తుతం న్యాయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. కోర్టు రూమ్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలి, న్యాయమూర్తుల పాత్ర ఎంత క్రియాశీలంగా ఉండాలనే అంశంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా, న్యాయం త్వరగా, స్పష్టంగా జరిగేందుకు జడ్జీల యాక్టివ్ భాగస్వామ్యం అవసరమని హైకోర్టు ఇచ్చిన సందేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News