Share News

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈకేవైసీకి రేపే లాస్ట్ డేట్..

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:17 PM

ఎల్పీజీ వినియోగదారులకు ఓ హెచ్చరిక. రేపటిలోగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈకేవైసీకి రేపే లాస్ట్ డేట్..

ఇంటర్నెట్ డెస్క్: ఎల్పీజీ వినియోగదారులకు ఓ హెచ్చరిక. రేపటి(ఆగస్టు 23వ తేదీ)లోగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. అలా చేయని వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ వర్తించదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రక్రియను గ్యాస్ కంపెనీ యాప్‌(హెచ్‌పీపే, ఇండియన్ ఆయిల్ వన్, హల్లో బీపీసీఎల్)లలో సొంతంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపాయి. ఈ పద్ధతిలో చేసుకోలేని వారు డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌కు వెళ్లి నమోదు చేసుకోవాలి.


ఈకేవైసీ కాకపోతే సబ్సీడీ ఆగిపోవచ్చు!

ఈ నెల 23లోగా ఈకేవైసీని పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందదని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. దానివల్ల మార్కెట్ ధరకే సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. కనెక్షన్ పూర్తిగా రద్దుకాకపోయినా, ఎలాంటి అంతరాయాలు లేకుండా గ్యాస్ కనెక్షన్ కొనసాగాలంటే కచ్చితంగా నమోదు చేసుకోవాలి. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండాలంటే ఈకేవైసీ నమోదు తప్పనిసరి.


ఎందుకు ఈకేవైసీ?

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ కనెక్షన్ల వివరాలను పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈకేవైసీని కఠినంగా అమలు చేస్తోంది. దీనిని పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

'ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నది.. విశ్వసనీయత లేదు': భారత విదేశాంగ శాఖ

ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ.. ఈ సారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..

Updated Date - Aug 22 , 2026 | 01:17 PM