Share News

2035లో తేజస్‌ ఎంకే-2 ఉపయోగపడకపోవచ్చు.. వైమానిక దళ మాజీ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:48 PM

స్వదేశీ యుద్ధవిమానం తేజస్‌ ఎంకే-2పై భారత వైమానిక దళం మాజీ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ చేసి రెండు నెలలు కూడా కాకముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రక్షణ రంగంలో చర్చకు దారితీశాయి.

2035లో తేజస్‌ ఎంకే-2 ఉపయోగపడకపోవచ్చు.. వైమానిక దళ మాజీ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
Tejas Mk-2

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశీ యుద్ధవిమానం తేజస్‌ ఎంకే-2పై భారత వైమానిక దళం మాజీ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ చేసి రెండు నెలలు కూడా కాకముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రక్షణ రంగంలో చర్చకు దారితీశాయి. 2035 నాటికి తేజస్‌ ఎంకే-2 విమానాలు పెద్ద సంఖ్యలో వైమానిక దళంలోకి వచ్చినప్పటికీ.. అవి ఫ్రంట్‌లైన్ యుద్ధ సామర్థ్యానికి సరిపడకపోవచ్చని కపూర్ అభిప్రాయపడ్డారు (Tejas Mk-2).


చైనా ఇప్పటికే 6వ తరం విమాన సదుపాయాలకు మారిందని, పాకిస్తాన్ 5వ తరం జెట్‌లను పరిశీలిస్తోందని, అలాంటిది 2035 నాటికి భారతదేశం నాలుగో తరం విమానాలను కలిగి ఉండటం సమంజసమేనా అని ప్రశ్నించగా, 'లేదు, కార్యాచరణ పరంగా అయితే కచ్చితంగా కాదు' అని ఎయిర్ మార్షల్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం భారత్‌ వద్ద ఐదో లేదా ఆరో తరం యుద్ధవిమానాలు లేవని కపూర్ పేర్కొన్నారు (Tejas fighter jet).


మరోవైపు చైనా ఐదో తరం జే-20 విమానాలను భారీ సంఖ్యలో మోహరించే దిశగా వెళ్తోందని, 2030 నాటికి వాటి సంఖ్య 500కు చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే భారత్‌కు తేజస్‌ ఎంకే-2 పూర్తిగా అనవసరం అని ఆయన చెప్పలేదు. ఐదు, ఆరో తరం విమానాలను దేశంలోని ప్రతి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మోహరించడం సాధ్యం కాదని, అందువల్ల కొన్ని ప్రాంతాల్లో నాలుగో తరం విమానాలను కొంతవరకు ఉపయోగించవచ్చని ఆయన అన్నారు (India fighter aircraft).


కాగా, భారత్‌ స్వదేశీ యుద్ధవిమానాల అభివృద్ధిని కొనసాగించాల్సిందేనని కపూర్ స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయ సహకారంతో తరువాతి తరం యుద్ధవిమాన కార్యక్రమాల్లో కూడా చేరాలని సూచించారు. ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ కలిసి అభివృద్ధి చేస్తున్న ఎఫ్‌సీఏఎస్‌ (FCAS) లేదా బ్రిటన్‌, ఇటలీ, జపాన్‌ కలిసి చేపడుతున్న జీసీఏపీ (GCAP) వంటి కార్యక్రమాల్లో భారత్‌ భాగస్వామి కావాలని ఆయన సూచించారు. అలాగే తేజస్‌ ఎంకే-1ఏ విమానాల సరఫరాలో హెచ్‌ఏఎల్‌ చేస్తున్న ఆలస్యంపై కూడా మాజీ ఉపాధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..


మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 22 , 2026 | 12:52 PM