Share News

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , Publish Date - Jul 29 , 2026 | 03:48 PM

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Om Birla

ఇంటర్నెట్ డెస్క్: పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించింది. పశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడడమే బిల్లు లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా గురువారానికి వాయిదా వేశారు.


కాగా పేపర్‌ లీక్‌ కేసుల్లో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇదివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానా ఉండేది. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం

కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..

Updated Date - Jul 29 , 2026 | 05:30 PM