రోహిత్ శర్మను మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంటుందో లేదో!: జోస్ బట్లర్
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:28 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నుంచి జెర్సీ అడిగి తీసుకున్న సందర్భాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ అనంతరం రోహిత్ నుంచి బట్లర్ జెర్సీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నుంచి జెర్సీ అడిగి తీసుకున్న సందర్భాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ అనంతరం రోహిత్ నుంచి బట్లర్ జెర్సీ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్ సంతకం చేసి ఇచ్చిన జెర్సీ తనకు దక్కడం ఎంతో ప్రత్యేకమని బట్లర్ ఆనందం వ్యక్తం చేశాడు. కొంతకాలంగా రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్ దగ్గరకి వెళ్లి జెర్సీ అడగడం కొంచెం భయంగానే అనిపించింది. ఆ సమయంలో ఆయన ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అయినా ధైర్యం చేసి అడిగాను. వెంటనే కాల్ ముగించి ఎంతో ఆప్యాయంగా స్పందించారు. తన జెర్సీపై సంతకం చేసి ప్రత్యేక సందేశం రాసి నాకు అందించారు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ కోసం భారత జట్టు మేనేజర్ నా జెర్సీ అడిగారు. అది ఇచ్చేందుకు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లా. అక్కడ స్వయంగా రోహిత్‌ను కలవాలని ఎదురుచూశా. ఆయనను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థిగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందో.. లేదో తెలియదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ శర్మను కలిసే తీరాలని నిశ్చయించుకున్నా. లార్డ్స్ మ్యాచ్ అనంతరం వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకోవద్దని అనుకున్నా. అందుకే ధైర్యం చేసి రోహిత్ వద్దకు వెళ్లి జెర్సీ అడిగి తీసుకున్నా’ అని బట్లర్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు.
కాగా, భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ శర్మ 110 బంతుల్లో 138 పరుగులు చేసినా భారత్‌కు విజయం దక్కలేదు. అదే మ్యాచ్‌లో బట్లర్ కేవలం 13 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్ చెత్త రికార్డు.. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో పరాజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్..