Share News

ఇంట్లోకి దూరిన చిరుత

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:43 PM

రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్‌లోని సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్‌ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.

ఇంట్లోకి దూరిన చిరుత
leopard, Mysoor, Bengaluru

బెంగళూరు: రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్‌లోని సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్‌ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు. చిరుత నేరుగా శైలజా ఉంటున్న గదిలోని మంచం కిందకు చేరుకుంది. కొంతసేపటి తర్వాత చిరుత ఉన్న విషయాన్ని సుజాత గుర్తించి ఖంగుతింది. ఎట్టకేలకు తేరుకుని చిరుత దాడి చేయకముందే తల్లిని గదినుంచి బయటకు రప్పించి బయట తాళాలు వేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


pandu1.3.jpgఅటవీశాఖ నిపుణులు కూడా వచ్చి చిరుతకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ప్రయత్నం సఫలమైంది. సుమారు రెండు గంటలపాటు చిరుత మంచం కింద ఉన్నట్లు తెలుస్తోంది. చిరుత వచ్చిందనే సమాచారంతో సిద్దార్థనగర్‌లో సందడి నెలకొంది. ప్రజలు గుమిగూడి ఇబ్బంది కలగకుండా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. కాగా తల్లిని చిరుతదాడి బారిన పడకుండా కాపాడిన సుజాత ధైర్యాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.


pandu1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

హీరో నచ్చితే విజిల్‌ కొట్టొచ్చు.. రాష్ట్రాన్నే అప్పగించగలమా?

ఇళ్ల ముందు ‘విజిల్‌’ ముగ్గులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 12:43 PM