Shashi Tharoor: బలవంతుడిదే రాజ్యం... వెనెజువెలాలో అమెరికా సైనిక చర్యపై శశిథరూర్
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:27 PM
మదురో 12 ఏళ్ల పాలనకు తెరదించుతూ వెనుజువెలాపై అమెరికా ఆపరేషన్ జరిపింది. మదురో సమాచారం చెప్పన వారికి 50 మిలియన్ డాలర్లను బహుమతిని కూడా గతంలో ప్రకటించింది. దాడుల అనంతరం మదురో చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు తగిలించి కరేబియన్‌లో అమెరికా నేవీ షిప్‌ను ఎక్కిస్తున్న ఫోటోను ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: వెనిజువెలాపై, ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోపైనా అమెరికా తీసుకున్న చర్యపై కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. 'బలవంతుడితే రాజ్యం' అనే సూత్రం అమలవుతోందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా కూడా శశిథరూర్ ఉన్నారు.
వెనెజువెలాపై కొన్ని నెలలుగా ఒత్తిడి రాజకీయాలు సాగిస్తున్న అమెరికా శనివారం నాడు ఆ దేశంపై దాడికి దిగి, దేశాధ్యక్షుడు మదురో, ఆయన భార్యను బందీగా పట్టుకుంది. న్యూయార్క్‌లోని విచారణ కోర్టు ముందుకు మదురోను హాజరుపరచనుంది. దీనిపై రచయిత కపిల్ కోమిరెడ్డి చేసిన ఒక పోస్టుపై శశిథరూర్ స్పందించారు. సైనిక చర్య ద్వారా మదురోను బంధించడం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఆయన అన్నారు. ఇవాళ అంతర్జాతీయ చట్టాలు, యూఎన్ చార్టర్లు ఉల్లంఘనకు గురవుతున్నాయని.. బలవంతుడిదే రాజ్యం అనే సూత్రం అమలవుతోందని, ఆటవిక చట్టం ప్రబలంగా ఉందని పేర్కొన్నారు.

మదురో 12 ఏళ్ల పాలనకు తెరదించుతూ వెనుజువెలాపై అమెరికా ఆపరేషన్ జరిపింది. మదురో సమాచారం చెప్పిన వారికి 50 మిలియన్ డాలర్లను బహుమతిని కూడా అమెరికా గతంలో ప్రకటించింది. దాడుల అనంతరం మదురో చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు తగిలించి కరేబియన్‌లో అమెరికా నేవీ షిప్‌ను ఎక్కిస్తున్న ఫోటోను ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల ఆరోపణలపై మదురో దంపతులు న్యూయార్క్ కోర్టులో విచారణను ఎదుర్కోనున్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడులు... భారత్ రియాక్షన్
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి