సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ
ABN , Publish Date - May 12 , 2026 | 11:46 AM
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు ఆ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌కు ఓటర్ స్పష్టమైన మేజార్టీ కట్టబెట్టాడు.
న్యూఢిల్లీ, మే 13: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు ఆ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌కు ఓటరు స్పష్టమైన మేజార్టీ కట్టబెట్టాడు. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా.. ముఖ్యమంత్రి ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు జరుగుతుంది. సీఎంని ఎంపిక చేయడం కోసం మంగళవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కేరళ మాజీ పీసీసీ నేతలు.. కె. సుధాకరన్, కె. మురళీధరన్, వి.ఎం. సుధీరన్, ముల్లపల్లి రామచంద్రన్ సమావేశం కానున్నారు.
సీఎం రేసులో ఆ ముగ్గురు..
కేరళ ముఖ్యమంత్రి పదవి రేసులో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల ఉన్నారు. ఈ రేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ముందు వరుసలో ఉంది. రాహుల్ గాంధీని ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండడమే కాకుండా.. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.
వీడీ సతీశన్ సైతం ప్రతిపక్ష నేతగా ఉండి.. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించారు. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
రమేశ్ చెన్నితాల పార్టీలో సీనియర్ నేత. క్లిష్ట సమయంలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన అన్ని తానై వ్యవహరించారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో..
ఈ ఎన్నికల్లో కేరళను పదేళ్ల పాలించిన ఎల్డీఎఫ్‌కు కేవలం 35 సీట్లకే పరిమితమైంది. బీజేపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో..
ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోని నాలుగు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల జరిగాయి. మే 4వ తేదీన ఆయా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దాంతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పటికే జరిగిపోయింది.
అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ కేరళలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోనియాగాంధీతో ఈ రోజు జరుగనున్న ఈ భేటీతో సీఎం ఎవరనే దానిపై స్పష్టత వస్తుందని కేరళలోని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం.. రంగంలోకి ఐటీ అధికారులు
పీఎంజే జ్యువెలరీ చోరీ.. పోలీసుల అదుపులో నిందితులు
For More National News And Telugu News