పీఎంజే జ్యువెలరీ చోరీ.. పోలీసుల అదుపులో నిందితులు
ABN , Publish Date - May 12 , 2026 | 06:55 AM
పీఎంజే జ్యువెలరీ షాప్‌లో చోరీ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ చోరీకి సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
కరీంనగర్, మే12: పీఎంజే జ్యువెలరీ షాప్‌లో చోరీ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ చోరీకి సంబంధించి నలుగురు దొంగలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ జ్యువెలరీ షాప్‌లో దోచుకున్న నగలను పశ్చిమ బెంగాల్ వ్యాపారికి విక్రయించినట్లు పోలీసుల విచారణలో దొంగలు వెల్లడించినట్లు సమాచారం.
అదుపులోకి తీసుకున్న ఈ దొంగల వద్ద నుంచి కొంత బంగారంతోపాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసులో మరో దొంగ ఆచూకీ తెలియలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చోరీ ఘటన.. నిందితులు చెప్పిన అంశాలను నేడో రేపో మీడియాకు పోలీసులు వివరించనున్నారు.
మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజీ జ్యువెలరీ షాపులో భారీగా బంగారంతోపాటు నగదు చోరీ జరిగింది. బైక్‌లపై సాధారణ కస్టమర్లలాగా వచ్చిన ఐదుగురు దొంగలు.. షాపులో క్షణాల్లో బీభత్సం సృష్టించారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించడంతో పాటు.. వారిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారం, నగదు చోరీ చేసి.. బైకులపై వారు పరారయ్యారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జ్యువెలరీ షాప్ పరిసర ప్రాంతంతోపాటు నగరంలోని వివిధ ప్రధాన మార్గాల్లోని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు జల్లెడ పట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టించిన వారికి నగదు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కారు నుజ్జునుజ్జయినా.. నూకలు మిగిలాయ్!
For More TG News And Telugu News