Share News

కారు నుజ్జునుజ్జయినా.. నూకలు మిగిలాయ్‌!

ABN , Publish Date - May 12 , 2026 | 04:41 AM

రోడ్డు మీద వేగంగా దూసుకెళుతున్న ఓ ఆయిల్‌ ట్యాంకరు ముందువెళుతున్న కారును ఢీ కొడితే ఐదారుపల్టీలు కొట్టి ధ్వంసమైపోయిన ఆ కారు! ఫొటో చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ...

కారు నుజ్జునుజ్జయినా..  నూకలు మిగిలాయ్‌!

రోడ్డు మీద వేగంగా దూసుకెళుతున్న ఓ ఆయిల్‌ ట్యాంకరు ముందువెళుతున్న కారును ఢీ కొడితే ఐదారుపల్టీలు కొట్టి ధ్వంసమైపోయిన ఆ కారు! ఫొటో చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! ఓవైపు రోడ్డుకు అడ్డంగా పడ్డ అయిల్‌ ట్యాంకరు.. ఇంకోవైపు డివైడర్‌ మీద నుజ్జునుజ్జయిన కారు! ఆ కారులో ఉన్నవారికి ఏం జరిగిందోనని ఆ దారిన వెళుతున్న వాహనదారులు తీవ్ర ఆందోళనకుగురయ్యారు. అయితే అంతా చూస్తుండగానే ఆ కారులో ఉన్న ముగ్గురు యువకులూ ఎలాంటి గాయాల్లేకుండా తమకుతాముగా బయటకొచ్చి నిల్చున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం సంభవించినా.. కారులోని ముగ్గురూ సీటు బెల్టు ధరించడం, ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో వారికి ప్రమాదం తప్పింది. ముగ్గురు బాధితులూ ఏపీలోని ప్రకాశం జిల్లా వాస్తవ్యులు అని తెలిసింది! ప్రమాదం తాలూకు షాక్‌తో ఆ ముగ్గురు తమ వివరాలు వెల్లడించలేకపోయారు.

- ఆంధ్రజ్యోతి, చిట్యాల రూరల్‌

Updated Date - May 12 , 2026 | 04:41 AM