Share News

కాశ్మీర్‌లో ఉప్పెనలా విరుచుకుపడ్డ మంచు చరియలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:08 PM

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్‌లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాశ్మీర్‌లో ఉప్పెనలా విరుచుకుపడ్డ మంచు చరియలు.. వీడియో వైరల్
Kashmir Heavy Snowfall

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో మంచు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచు, చల్లటి గాలులతో స్థానికులు గజ గజ వణికిపోతున్నారు. మంగళవారం కాశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్‌లోని స్బాల్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మంచు చరియలు కూలి ఉప్పెనలా దూసుకొచ్చాయిని అధికారులు తెలిపారు. మంచు.. ఇళ్లు, రీసార్ట్స్ మొత్తం కప్పేసిందని, ప్రాణ నష్టం ఎక్కడా సంభవించలేదని అధికారులు తెలిపారు.


కొండలపై నుంచి భారీ ఎత్తున మంచు.. ఉప్పెనలా దూసుకొచ్చి భవనాలను ముంచెత్తుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం నుంచి సోనామార్గ్‌తో పాటు కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో భారీ హిమపాతం సంభవించి ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. శ్రీనగర్, అనంతనాగ్, సోనామార్గ్, పుల్వామా, పహల్గావ్, కార్గిల్, కుప్వారా, బేతాబ్ వ్యాలీ, పూంచ్ సహా పలు ప్రాంతాల్లో రెండు మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది.


ఇవి కూడా చదవండి:

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 28 , 2026 | 03:55 PM