Share News

రైలు ఆలస్యమైనందుకు.. రూ.9లక్షల పరిహారం

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:13 AM

రైలు ఆలస్యంగా నడచిన కారణంగా కీలకమైన ప్రవేశపరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థినికి రూ.9.10లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం రైల్వేశాఖను ఆదేశించింది.

రైలు ఆలస్యమైనందుకు.. రూ.9లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్‌, జనవరి 27: రైలు ఆలస్యంగా నడచిన కారణంగా కీలకమైన ప్రవేశపరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థినికి రూ.9.10లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం రైల్వేశాఖను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి 2018లో తన బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్ష కోసం లఖ్‌నవూ వెళ్లేందుకు ఆమె ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్‌ రైలు బుక్‌ చేసుకుంది. ఉదయం 11 గంటలకు లఖ్‌నవూ చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంకావడంతో సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయింది. దీంతో ఆ విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ విద్యార్థిని రైల్వే శాఖ నుంచి రూ.20లక్షల పరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది.

Updated Date - Jan 28 , 2026 | 03:13 AM