ఢిల్లీని కోటలా మార్చారు.. ప్రధాని మోదీ, అమిత్ షాపై జైరాం రమేశ్ విమర్శలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:17 AM
ప్రధాని మోదీ ఢిల్లీని దుర్భేద్యమైన కోటలా మార్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ మండిపడ్డారు. దేశ యువత శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయాలనుకుంటే ఇంతలా ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో సీజేపీ చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడానికి కేంద్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు.
‘శాంతియుతంగా నిరసనలు తెలియజేసే హక్కును రాజ్యాంగం ప్రతి పౌరులకు కల్పించింది. దేశ యువత డిమాండ్ ఏదైనా కావచ్చు.. వారు శాంతియుతంగా నిరసనను వ్యక్తం చేయాలనకుంటే.. ఇంతలా బందోబస్తును ఏర్పాటు చేయడమేమిటి? ఢిల్లీని దుర్భేద్యమైన కోటలా మార్చారు. నలువైపులా పోలీసులను మోహరించారు. రైళ్లను నిలిపివేశారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీన్నిబట్టి దేశ యువత వల్ల ప్రధాని మోదీ, అమిత్ షా ఆందోళన చెందుతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు జీవితకాల రక్షణ కల్పించేలా 2023లో చట్టం చేసి.. బలవంతంగా పార్లమెంటులో ఆమోదింపజేశారు కదా. మరి ఇంకా ఎందుకు భయం’ అని జైరాం రమేశ్ నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు