ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఇండియన్ యూత్ కాంగ్రెస్.. నిరసనలకు అనుమతిపై రేపు అత్యవసర విచారణ
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:52 PM
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Indian Youth Congress Delhi High Court: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా ఆందోళనలు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసులు ఏకపక్షంగా అనుమతులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో ఐవైసీ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా సమావేశమై నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారని, క్రమబద్ధీకరించే అధికారాన్ని పూర్తిగా నిషేధించే అధికారంగా మార్చలేరని యూత్ కాంగ్రెస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఢిల్లీ రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతోనే ఈ నిరసనలకు అనుమతి నిరాకరించినట్లు దిల్లీ పోలీస్ యంత్రాంగం పేర్కొంటోంది. ఢిల్లీ హైకోర్టు బెంచ్ రేపు ఉదయం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి...
సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..
ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News