Share News

హనీట్రాప్ గూఢచర్యంలో ఒక భాగం.. వాయుసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:11 PM

విదేశీ సైబర్ దాడులకు లొంగనంత సురక్షితంగా భారత మిలటరీ వ్యవస్థ, దాని పరిశోధన విభాగాలున్నాయని.. అందుకే విదేశీ ఇంటెలిజెన్స్ వలపు వలలు విసిరే మార్గాన్ని ఎంచుకుందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ అశుతోశ్ దీక్షిత్ పేర్కొన్నారు.

హనీట్రాప్ గూఢచర్యంలో ఒక భాగం.. వాయుసేన చీఫ్ కీలక వ్యాఖ్యలు
honey trap espionage

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ సైబర్ దాడులకు లొంగనంత సురక్షితంగా భారత మిలటరీ వ్యవస్థ, దాని పరిశోధన విభాగాలున్నాయని.. అందుకే విదేశీ ఇంటెలిజెన్స్ వలపు వలలు విసిరే మార్గాన్ని ఎంచుకుందని భారత వాయుసేన చీఫ్ మార్షల్ అశుతోశ్ దీక్షిత్ పేర్కొన్నారు.


‘మిలటరీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అనేది పబ్లిక్ నెట్‌వర్క్ నుంచి వేరుగా ఉంటుంది. దానిపై సైబర్ దాడికి పాల్పడడం అసాధ్యం. అందుకే విదేశీ ఇంటెలిజెన్స్.. సాంకేతికంగా దెబ్బతీయలేక.. హనీ ట్రాప్ పేరుతో మనుషులను ఉపయోగిస్తోంది. పబ్లిక్ సెక్టార్ లాబోరేటరీ సిబ్బంది, ప్రైవేట్ సెక్టార్‌లోని డిఫెన్స్ కాంట్రాక్టర్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రేమ ప్రేరుతో ట్రాప్ చేస్తున్నారు.

వలపు వలలు అనేవి ఇంటెలిజెన్స్ గూఢచర్యంలో చిన్న భాగం. నిజానికి ఇది వలపు వల కాదు. గూఢచర్యంలో ఓ భాగం. ఈ రోజుల్లో ఇది సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మొత్తం గూఢచర్య మార్గాలను పరిగణనలోకి తీసుకుంటే హనీట్రాప్.. ఒక అంశం మాత్రమే. లోన్స్ పేరుతో, మార్కెట్ పేరుతో.. ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిపై నిరంతర దృష్టి పెడుతున్నాం. నిశితంగా పరిశీలిస్తూ.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. మిలటరీ నెట్‌వర్స్‌పై సైబర్ దాడులకు పాల్పడలేరు. కానీ.. వ్యవస్థ లోపలి నుంచి ప్రమాదం పొంచి ఉంది. అందుకే దానికి సంబంధించి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఉద్యోగులకు ఈ విషయాలపై అవగాహణ కల్పిస్తున్నాం’ అని మార్షల్ అశుతోశ్ తెలిపారు.


ఈ మధ్య కాలంలో ఇలాంటి హనీ ట్రాప్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి తన సహోద్యోగి మొబైల్‌లో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీలోని ఓ ఢిఫెన్స్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. వ్యక్తిగత జీవితంలో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ఆయనకు.. కొన్ని నెలలుగా.. పాకిస్థానీ గూఢచారిగా భావిస్తున్న ఓ మహిళతో సాన్నిహిత్యం ఉన్నట్లు తేలింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇండియన్ నేవీ అధికారి ప్రదీప్ ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా ప్రదీప్.. పాకిస్థానీ మహిళతో సోషల్ మీడియా ద్వారా స్నేహం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం.. ఎన్విడియా సీఈవో.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

సచిన్‌లా ఎదుగుతాడా? కాంబ్లీలా మిగిలిపోతాడా?.. వైభవ్‌పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 16 , 2026 | 04:13 PM