Share News

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం

ABN , Publish Date - Aug 14 , 2026 | 08:40 PM

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎత్తిపొడుపు మాటలు సరికాదంటూ.. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన కీలకమని చెప్పింది.

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం
India Stresses Strong Ties With Italy Amid Congress-Meloni Row

ఢిల్లీ, ఆగస్టు 14: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసింది. 'భారత్.. ఇటలీతో బలమైన సంబంధాలు కలిగి ఉందని, దీనిని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రెండు దేశాల మధ్య స్నేహం, ద్వైపాక్షిక సంబంధాలకు పరస్పర గౌరవం, అవగాహన ముఖ్యమని వెల్లడించింది.


మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకులను కౌగిలించుకోవడంపై విమర్శలు చేస్తూ, ప్రధాని విదేశాంగ విధాన నిర్వహణను ఎగతాళి చేసినందుకు రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. ఆ కాంగ్రెస్ ఎంపీ 'సంస్కారహీనమైన, అసభ్యకరమైన' భాషను ఉపయోగించారని, ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని తగ్గించారని దుయ్యబట్టింది.


వివాదం ఏంటి?

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సీనియర్ నేత సందీప్ దీక్షిత్‌ను నకిలీ కౌగిలింత (Mock Hug)తో పలకరించారు. ప్రధాని మోదీ విదేశీ నాయకులను కౌగిలించుకునే వైఖరిని ఎద్దేవా చేస్తూ రాహుల్ గాంధీ ఈ చర్యలు చేశారు. రాజనీతిని కేవలం ఒక నటనగా మోదీ తగ్గిస్తున్నారని రాహుల్ విమర్శించగా, మధ్యలో సందీప్ దీక్షిత్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు. దానికి రాహుల్ కూడా సరదాగా స్పందించడం రాజకీయ దుమారానికి దారితీసింది.


ఇవి కూడా చదవండి...

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

Read Latest National News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 09:15 PM