Share News

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:39 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో తాజాగా ఊరట దక్కింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి నేరపూరిత పరువు నష్టం కేసును సుప్రీం కోర్టు తాజాగా కొట్టేసింది.

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం
Criminal Defamation Case on Rahul Gandhi Quashed

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో తాజాగా ఊరట దక్కింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి నేరుపూరిత పరువు నష్టం కేసును సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కొట్టేసింది. ఈ కేసులో లఖ్నవూ మెజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించిన ముందస్తు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదని పేర్కొంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెబుతూ నృపేంద్ర పాండే కేసు దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు కోసం అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌‌ను ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను ఏసీజేఎమ్ తోసిపుచ్చారు. ఈ తీర్పును పిటిషనర్ సెషన్స్ కోర్టులో సవాలు చేయగా న్యాయస్థానం కేసును మళ్లీ మెజిస్ట్రేట్‌కు బదిలీ చేసింది. ఈ క్రమంలో లఖ్నవూ మెజిస్ట్రేట్ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. సమన్లను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై క్రిమినల్ చర్యలను కొట్టేయాలని అభ్యర్థించారు. అయితే, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని రాహుల్ గాంధీకి సూచించింది.


ఈ క్రమంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీకి తాజాగా ఊరట దక్కింది. సెక్షన్ 153ఏ కింద చర్యలు చేపట్టేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేని కారణంగా రాహుల్‌పై దాఖలైన కేసును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అయితే, స్వాతంత్ర సమరయోధుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయొద్దని కూడా సుప్రీం కోర్టు రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

Updated Date - Aug 14 , 2026 | 01:49 PM