Share News

ప్రజాస్వామ్య రక్షణకు కలిసికట్టుగా పోరాడుతాం: రాహుల్

ABN , Publish Date - Oct 13 , 2026 | 07:21 PM

ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల తొలగింపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపై నేతలు చర్చించారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేతో కలిసి రాహుల్ గాంధీ.. మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్య రక్షణకు కలిసికట్టుగా పోరాడుతాం: రాహుల్

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల తొలగింపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపై నేతలు చర్చించారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేతో కలిసి రాహుల్ గాంధీ.. మీడియాతో మాట్లాడారు. ఇటీవలే జంతర్ మంతర్‌లో తాము నిర్వహించిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు విజయవంతం అయ్యాయని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు తమ నిరసనను తెలియజేయడానికి జంతర్ మంతర్ ఒక వేదికగా ఉపయోగపడిందని, ఇప్పుడు ఆ వేదికను కూడా కేంద్ర ప్రభుత్వం లాగేసుకుందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య భావాలను తెలియజేయడానికి ఇక జంతర్ మంతర్‌ను ఏవిధంగానూ ఉపయోగించలేని పరిస్థితి తెచ్చారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు.


నిరసనలు తెలిపే వేదికల నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సవాలు చేస్తామని రాహుల్ తెలిపారు. ‘భారత ప్రజలు తమ నిరసనను తెలిపే హక్కును కేంద్రం కాలరాయలేదు. అదంత సులభం కాదు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు ఆ ముగ్గురి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజ్యాంగాన్ని నాశనం చేసి పారిపోతామంటే కుదరదు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికే ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి నేతలంతా ఒక్కటయ్యారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో తగ్గేదేలేదని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అత్తమామల వేధింపులతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య.. సుసైడ్ నోట్ కలకలం!

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Updated Date - Oct 13 , 2026 | 07:42 PM