యూపీ బోర్డ్ పరీక్షల్లో టాపర్ నుంచి హార్వర్డ్ వరకు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రస్థానం!
ABN , Publish Date - Oct 12 , 2026 | 06:32 PM
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయనను సీఈసీ పదవికి రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో నిరసలను చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయనను సీఈసీ పదవికి రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో నిరసలను చేస్తున్నారు. అలానే సీజేపీ నేతలు కూడా సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సాధారణ పాఠశాల విద్యార్థి దశ నుంచి కేంద్రం ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ వరకు సాగిన ఆయన ప్రయాణం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. ఆయన జర్నీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
1964లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన జ్ఞానేశ్ కుమార్ గోరఖ్‌పూర్, లఖ్‌నవూ, కాన్పూర్‌లలో తన పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1979 పదో తరగతి, 1981 ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆ రెండు బోర్డులోనూ టాపర్‌గా నిలిచారు. అనంతరం కాన్పూర్‌లోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నారు. అంతేకాకుండా, ఐసీఎఫ్‌ఏఐలో బిజినెస్ ఫైనాన్స్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ అభ్యసించారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ 2025లో ప్రత్యేకంగా డిస్టింగ్యూష్డ్ అల్యూమ్నస్ అవార్డుతో సత్కరించింది.
1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిగా సివిల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టిన జ్ఞానేశ్ కుమార్, రాష్ట్రంలోనూ.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూకశ్మీర్, అయోధ్య వంటి సున్నితమైన పరిణామాల సమయంలోనూ ఆయన సేవలందించారు. ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఆయన, ఆ తర్వాత దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఈ వార్తలనూ చదవండి:
తిరువళ్లువర్‌కు కాషాయ రంగు.. బీజేపీపై టీవీకే సెటైర్లు..
హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!
ట్రాఫిక్ రోడ్లపై వడాపావ్‌లు అమ్ముతూ నెలకు రూ.80 వేలు