Share News

పెట్టుబడిదారులకు అండగా కూటమి ప్రభుత్వం: డిప్యూటీ సీఎం

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:47 PM

16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్లు పెట్టుబడులు, రూ.2,090 కోట్లతో పూర్తయిన 4 ప్రత్యేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభసూచకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోందని అన్నారు.

పెట్టుబడిదారులకు అండగా కూటమి ప్రభుత్వం: డిప్యూటీ సీఎం

కాకినాడ, అక్టోబర్12: 16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్లు పెట్టుబడులు, రూ.2,090 కోట్లతో పూర్తయిన 4 ప్రత్యేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభసూచకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోందని అన్నారు. సోమవారం కాకినాడలో జరిగిన ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడులకు, ప్రగతికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామమని అభివర్ణించారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేస్తారనేది తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. జాతి కోసం, దేశం కోసం పారిశ్రామికవేత్తలు ఆలోచించాలని స్పష్టం చేశారు.


సింగపూర్ తరహాలో సమష్టి శ్రమతో విజయం సాధ్యమని అన్నారు. ఐక్యంగా ఆంధ్రప్రదేశ్ పురోగతిలో భాగస్వాములం అవుదామని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పరిశ్రమలు మొదటి రోజు నుంచే పర్యావరణం మీద దృష్టిపెట్టాలని సూచించారు. అనుమతులు, ప్రోత్సాహకాల విషయంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు.


గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్కృతి అప్పట్లో ఉండేదని చెప్పారు. కానీ మీరు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఏం ఇస్తారు..? ప్రజలకు ఏం చేస్తారని అడిగి సత్సంప్రదాయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 05:56 PM